నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి థర్డ్ పార్టీ యాప్ ను ఉపయోగించడం వల్ల తన ఖాతా నుంచి రూ. 1.94 లక్షలు కోల్పోయాడు. ఏప్రిల్ 21, 22 తేదీల్లో రెండు విడతలుగా ఈ మొత్తం నకిలీ ఖాతాకు బదిలీ అయింది. మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.