నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక అభ్యర్థి వింత కోరిక కోరాడు. గురువారం నిర్వహించిన ప్రచారంలో, చెట్టు ఎక్కి కొబ్బరికాయ తీస్తున్న మహిళను ఉద్దేశించి, 'ఆ కొబ్బరికాయ నువ్వే తీసుకో. ఓటు మాత్రం మాకే వేసి ఆశీర్వదించు' అని అభ్యర్థించాడు. ఈ నెల 14న జరిగే ఎన్నికల్లో విజేతలు ఎవరో తేలనుంది.