నారాయణపేట: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

83చూసినవారు
నారాయణపేట: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
నారాయణపేట జిల్లా కేంద్రానికి సమీపం లోని సింగారం చౌరస్తా దగ్గర సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల/ దామరగిద్ద బాలుర కళాశాల ను శనివారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యా వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులు చదువుతున్న తీరును, మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం డార్మెటరీలు, కిచెన్ రూమ్ ను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్