సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక రోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు నర్సిములు తెలిపారు. పంచాయతీ కార్మికులకు నెలకు రూ. 9500 వేతనం ఇవ్వాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు. జీఓ 60 ప్రకారం వేతనాలు ఇవ్వాలన్నారు. జీఓ 61 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.