ఊట్కూరు: ముంపు గ్రామంగా ప్రకటించాలని తీర్మానం

7చూసినవారు
నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో పెద్ద చెరువు విస్తరణతో గ్రామానికి ముప్పు పొంచి ఉందని, ఇళ్ల పునాదుల్లోకి నీటి ఊట చేరుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రిజర్వాయర్ గా మారితే గ్రామం మునిగిపోయే ప్రమాదం ఉన్నందున, ఊట్కూరును పూర్తిస్థాయిలో ముంపు గ్రామంగా ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలని శుక్రవారం గ్రామసభలో ఏకగ్రీవంగా తీర్మానించారు. బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్