త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఆయన నివాసంలో జరిగిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, గతంలో కెసిఆర్ ప్రభుత్వం హాయంలో మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డుల్లో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. మక్తల్ మున్సిపాలిటీని తీసుకొచ్చిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీదే అని ఆయన తెలిపారు.