నారాయణపేట జిల్లా కోస్గి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు వార్ల మల్లేశం తన టెర్రస్ గార్డెన్ లో ఏడాదికి ఒక్కసారి మాత్రమే, మే నెలలో పూసే స్కాడోక్సస్ మల్టీఫ్లోరస్ @ పుట్బాల్ లిల్లీ మొక్క పుష్పాలను ఆవిష్కరించారు. అమరిల్లిడేసి కుటుంబానికి చెందిన ఈ దుంపకాండ మొక్కను పదేళ్ల క్రితం పాడేరు నుండి తెచ్చి కుండీలో నాటారు. గత ఏడాది నాలుగు పుష్పాలు రాగా, ఈ ఏడాది ఐదు పుష్పాలు వికసించాయని మల్లేశం సంతోషం వ్యక్తం చేశారు. జూన్ వరకు ఉండే ఈ పుష్పాలు రాలిపోయిన తర్వాత ఆకులు జనవరి వరకు ఉండి ఎండిపోతాయి. దుంప నేలలో పాతితే మరణం ఉండదని, అందుకే దీనిని 'మే పుష్పం' అని పిలుస్తారని తెలిపారు.