మంగళవారం, మంత్రి వాకిటి శ్రీహరి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, మక్తల్ నియోజకవర్గం ఉట్కూర్ మండల కేంద్రంను క్రాసింగ్ స్టేషన్‌గా అప్‌గ్రేడ్ చేయడం స్థానిక ప్రజల చిరకాల ఆకాంక్ష అని మంత్రి తెలిపారు. వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా ఉట్కూర్ స్టేషన్‌ను క్రాసింగ్ స్టేషన్‌గా అప్‌గ్రేడ్ చేయడం వల్ల 30 గ్రామాలకు చెందిన 60,000 మందికి పైగా ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, ఇది వారి జీవనోపాధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై రైల్వే జీఎం సానుకూలంగా స్పందించి, అప్‌గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు.