ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేశంలోనే అత్యుత్తమ రహదారులను నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో మాట్లాడుతూ, నారాయణపేట-వనపర్తి-గద్వాల జిల్లాలోని మండలాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తామని తెలిపారు. గత పదేళ్లలో రాష్ట్ర రహదారులను మెరుగుపరచలేదని ఆయన విమర్శించారు.