Jan 16, 2026, 02:01 IST/
కనుమ రోజున పశువులను ఎలా పూజించాలి?
Jan 16, 2026, 02:01 IST
కనుమ రోజున ఆవులు, ఎడ్లను శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తే ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చని భక్తులు నమ్ముతారు.