మహబూబ్‌నగర్ జిల్లా SP డి.జానకి ఆదేశాల మేరకు టౌన్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ CI కె.రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన 6 మందిని పట్టుకొని, సెకండ్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి ఆర్.శశిధర్ ఎదుట హాజరు పరచగా.. ద్విచక్ర వాహనదారునికి రూ.1000, 5 మంది డ్రైవర్లకు 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధించారు.