
దారుణం.. తల్లిని కొట్టి చంపిన కొడుకు
TG: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుదర్శన్ శుక్రవారం రాత్రి తన తల్లి సత్తమ్మ(60)తో మద్యం కోసం డబ్బుల విషయమై గొడవ పడ్డాడు. తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో అప్పటికే తాగి ఉన్న అతడు కర్రతో బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ సత్తమ్మ అక్కడికక్కడే మృతి చనిపోయారు. మృతురాలి కుమార్తె అనురాధ ఫిర్యాదుతో ఏఎస్ఐ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




