రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డిలకు వనపర్తి జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వరదలు, తుపానుల వల్ల నష్టపోయిన రైతులకు క్వింటాలుకు రూ. 500 బోనస్ గా రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసిందని, ఇది రైతులకు ఎంతో తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే రైతులతో కలిసి సంబరాలు చేసుకుంటామని తెలిపారు. ఈ బోనస్ విడుదల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.