శ్రీరంగాపురం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పలువురు BRS నాయకులు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ హడ్ కమిటీ సభ్యుడు ఎల్ల గౌడ్, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, సీనియర్ నాయకులు వీరపాగ కృష్ణయ్యలు బుధవారం వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి, కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, పార్టీ పటిష్టత కోసం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.