
సంక్రాంతి ఎఫెక్ట్.. ఆకాశాన్నంటిన నాటుకోడి ధరలు
సంక్రాంతి పండుగ సందర్భంగా నాటుకోళ్ల ధరలు భారీగా పెరిగాయి. సాధారణంగా రూ.800 ఉండే కేజీ నాటుకోడి ధర ఇప్పుడు రూ.2,000 నుంచి రూ.2,500 వరకు పలుకుతోంది. గోదావరి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో డిమాండ్ పెరగడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. హైదరాబాద్లో కేజీ నాటుకోడి రూ.600 నుంచి రూ.1,000 వరకు ఉంది. బాయిలర్ చికెన్ ధరలు కూడా పెరిగి, కేజీ రూ.340కి చేరుకుంది. పౌల్ట్రీ వ్యాపారులు దాణా, నిర్వహణ ఖర్చులు పెరగడమే దీనికి కారణమని చెబుతున్నారు. రానున్న వారంలో పండుగ నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.




