
భయపెడుతున్న స్క్రబ్ టైఫస్..అలర్ట్
వర్షాలు మొదలైతే ప్రకృతిలో కొత్త జీవం మొదలవుతుంది. కానీ అదే కాలంలో కొన్ని కనిపించని ప్రమాదాలు కూడా మొలుస్తాయి. వాటిలో ఒకటి స్క్రబ్ టైఫస్ అనే తీవ్రమైన బ్యాక్టీరియా సంక్రమణ. రికెట్సియా కుటుంబానికి చెందిన ఓరియంటియా సుట్సుగముషి అనే సూక్ష్మజీవి వల్ల కలిగే ఈ వ్యాధి, మన కళ్లకు కనిపించని నల్లిపురుగు వంటి చిన్న కీటకం ద్వారా వ్యాపిస్తుంది. ఇది కాటు వేసినప్పుడు మొదట పెద్దగా ఇబ్బంది కనిపించకపోయినా, కొద్ది రోజుల్లోనే ప్రభావం బయటపడుతుంది.




