వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రగతి హైస్కూల్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులు ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబరిచి, రంగులు అద్దారు. ప్రతిభ కనబరిచిన వారికి పాఠశాల కరస్పాండెంట్ బహుమతులు అందజేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు, ఇందులో విద్యార్థులు ఉల్లాసంగా పాల్గొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ 11-01-2026 నుండి 18-01-2026 వరకు విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. సెలవులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.