దివ్యాంగులు మానసిక స్థైర్యంతో రాణించాలి: శంకర్ గౌడ్

0చూసినవారు
దివ్యాంగులు మానసిక స్థైర్యంతో రాణించాలి: శంకర్ గౌడ్
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, వనపర్తిలోని బాలభవంలో సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ, దివ్యాంగులు మానసిక స్థైర్యంతో అన్ని రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు. వైకల్యం శరీరానికే గానీ మనసుకు కాదని, వైకల్యాన్ని అధిగమించి విజయం సాధిస్తున్న వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రతిభ గల దివ్యాంగులను సాహితీ కళా వేదిక ప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కందూరు నారాయణ రెడ్డి, చిన్నమ్మ థామస్, బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.