వనపర్తి జిల్లా రేమోద్దుల గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పిల్లలకు ఈత నేర్పించడానికి వెళ్లిన తండ్రి చింతకుంట నాగయ్య, కూతురు మీదిండ్ల విజయ కొచ్చేరువులో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. తల్లి విజయ స్నానం చేస్తుండగా కూతురు గుంతలో పడటంతో, ఆమెను కాపాడే ప్రయత్నంలో తండ్రి కూడా నీటిలో మునిగిపోయాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.