మానవత్వం చాటుకున్న కేతేపల్లి యువత

7చూసినవారు
మానవత్వం చాటుకున్న కేతేపల్లి యువత
కేతేపల్లి నుంచి వనపర్తికి గురువారం బైక్‌పై వెళ్తున్న దంపతులు ప్రమాదానికి గురయ్యారు. బైక్ అదుపుతప్పి పడిపోవడంతో గర్భిణితో పాటు చిన్నారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక యువత వెంటనే స్పందించి, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్‌లో వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న యువత చొరవను గ్రామస్థులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్