
రైతుల కోసం ప్రత్యేక యాప్.. ప్రాంతీయ భాషల్లో వాతావరణ సమాచారం
రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. వాతావరణ సమాచారాన్ని ప్రాంతీయ భాషల్లో అందించే 'మౌసమ్ వాణి' అనే సరికొత్త అప్లికేషన్ను Indian Institute of Tropical Meteorology (IITM) అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా రైతులు తమకు అవసరమైన వాతావరణ సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ప్రారంభంలో హిందీ, ఇంగ్లీష్లలో అందుబాటులోకి వచ్చి, తర్వాత తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషలకు విస్తరించనుంది. అయితే ఈ సేవను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు.




