
అమెరికా నుంచి పాక్‌కు అత్యాధునిక క్షిపణులు.. భారత్‌కు కొత్త తలనొప్పి?
భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ విరమణ తర్వాత అమెరికాకు దగ్గరయ్యేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో, అమెరికా అత్యాధునిక ఏఐఎమ్-120 క్షిపణులను పాకిస్థాన్‌కు అందించనున్నట్లు తెలిపింది. ఇవి గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే మధ్యశ్రేణి క్షిపణులు. అమెరికా రక్షణ శాఖ గత సెప్టెంబరు 30న 41.6 మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్‌ను ప్రకటించింది. ఈ క్షిపణులు పాక్‌తో సహా కొనుగోలు దేశాలకు 2030 మే నాటికి అందించాలని అమెరికా భావిస్తోంది.




