తపస్విని కిడ్స్ ప్లే స్కూల్లో పింక్ డే, నూతన సంవత్సర వేడుకలు

1చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలోని తపస్విని కిడ్స్ ప్లే స్కూల్లో చిన్నారులు పింక్ డే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. "Pink Day – Kind Always", "Wear Pink, Show You Care" నినాదాలతో పాఠశాల ప్రాంగణం నిండిపోయింది. ఒకరోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు జరుపుకొని, కేక్ కటింగ్ చేసి, మిఠాయిలు పంచుకుంటూ చిన్నారులు ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ కార్యక్రమం చిన్నారుల్లో స్నేహభావం, ప్రేమ, పంచుకోవడం వంటి విలువలను పెంపొందించిందని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్