వనపర్తి జిల్లా ఆత్మకూరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలనే ప్రజల ఆకాంక్షను బీజేపీ మైనార్టీ విభాగం నాయకులు సమ్మద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం జాతర మైదానం నుంచి సీఎం వెళ్తుండగా సమ్మద్ అకస్మాత్తుగా ప్రత్యక్షమై ప్లకార్డును ప్రదర్శించి, ఆత్మకూరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.