
చిరంజీవి, వెంకటేశ్ కాంబో మాస్ సాంగ్ గ్లింప్స్ (వీడియో)
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్న 'మన శంకర వర ప్రసాద్‌గారు' చిత్రం నుంచి 'మెగా విక్టరీ మాస్ సాంగ్' గ్లింప్స్ విడుదలైంది. ఈ చిత్రంలో వెంకటేశ్ గెస్ట్ రోల్లో నటిస్తున్నారు. ఇద్దరూ కలిసి నడుస్తూ థంబ్స్ అప్ సింబల్ చూపిస్తున్న గ్లింప్స్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.




