పాలనాపరంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి శుక్రవారం విమర్శించారు. మైనార్టీలను మభ్య పెట్టేందుకే అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా రహమత్నగర్ లో నిర్వహించిన 'మాట ముచ్చట' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, దిగజారుతున్న దుస్థితిని కాపాడుకోవడానికే కాంగ్రెస్ పార్టీ ఈ నాటకమాడుతోందని అన్నారు.