వనపర్తి: మురికి కాలువలు తీసిన కౌన్సిలర్

1చూసినవారు
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ 15వ వార్డులో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా మురికి కాలువలు పొంగి పొర్లాయి. లేట్ హోటల్ ఖాజా ఇంట్లోకి మురికి నీరు చేరడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ నారామన్ అయ్యన్న వెంటనే రంగంలోకి దిగి మురికి కాలువను శుభ్రం చేయించి కాలనీవాసుల మన్ననలు పొందారు. బక్రీద్ పండుగ సందర్భంగా తాగునీటి సమస్యను పరిష్కరించాలని, ఈ రెండు రోజులు క్రమం తప్పకుండా తాగునీరు సరఫరా చేయాలని కమీషనర్ సైదయ్యను కోరారు. గత వారం రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదని వార్డు ప్రజలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్