వనపర్తి: తండ్రి మరణించినా.. పదిలో సత్తా చాటిన విద్యాసాగర్

1చూసినవారు
వనపర్తి: తండ్రి మరణించినా.. పదిలో సత్తా చాటిన విద్యాసాగర్
తండ్రి మరణించిన తీవ్ర దుఃఖంలోనూ పట్టుదలతో పరీక్షలు రాసి విద్యాసాగర్ అద్భుత విజయం సాధించాడు. వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల ఎక్స్ రోడ్ కు చెందిన ఈ విద్యార్థి, 10వ తరగతి ఫలితాల్లో 600కు 480 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈర్లదిన్నె ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యాసాగర్ ను బుధవారం ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు. ఈ సంఘటన విద్యార్థుల పట్టుదలకు, స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్