వనపర్తి: ధాన్యం కొనుగోలులో జిల్లా యంత్రాంగం ఫెయిల్: రాచాల

2చూసినవారు
వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ బుధవారం పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో జిల్లా యంత్రాంగం విఫలమైందని, కలెక్టర్ డీఎస్ఓను గుడ్డిగా నమ్ముతున్నారని ఆయన ఆరోపించారు. జిల్లా కలెక్టరును వెంటనే బదిలీ చేయాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్‌పోర్టులో చూపిన లారీలన్నీ యథావిధిగా నడవాలని, 100% సీఎంఆర్ బకాయిలు చెల్లించిన 36 మిల్లులకు వెంటనే ధాన్యం కేటాయించాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్