వనపర్తి: మద్యం సేవించి వాహనాలు నడపొద్దు.. కళాబృందం అవగాహన

2చూసినవారు
రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్లచెరువు వద్ద తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం శుక్రవారం అవగాహన కల్పించింది. మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకపోవడం వల్ల కలిగే ప్రాణాపాయంపై స్కిట్ ప్రదర్శించారు. నిబంధనలు పాటించకపోతే కుటుంబాలు రోడ్డున పడతాయని హెచ్చరిస్తూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని కళాకారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్