వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 13.15 కోట్ల నిధులను మంజూరు చేసిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మంగళవారం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జీలు పెంచడంతో పాటు ప్రతి విద్యాలయానికి అవసరమైన అన్ని సదుపాయాలను అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.