వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం సల్కాలాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తన భార్య, పిల్లలను చంపి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సింహులు అనే వ్యక్తి భార్య, పిల్లలను తాళ్లతో కట్టేసి పొలంలోని సంపులో పడేసి హత్య చేశాడు. అనంతరం అతడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు దేవరకద్ర మండలం డొకూరుకు చెందిన వారీగా గుర్తించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.