వనపర్తి: ప్రాంతీయవాదం ఉగ్రవాదం అయితే మీరే ఉగ్రవాదులు: నిరంజన్

0చూసినవారు
వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను కించపరిచేలా మాట్లాడటం తగదని, ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అనడంపై ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసుకోవడం ప్రాంతీయవాదం అయితే, అలా విమర్శించే మీరే నిజమైన ఉగ్రవాదులవుతారని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్