వనపర్తి: ప్రజా ప్రభుత్వంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు: MLA

2చూసినవారు
వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం సల్కలాపూర్ గ్రామంలో నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలలో శనివారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ పేరుతో బీదలను మోసం చేసిందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్