వనపర్తి: జూరాల ప్రాజెక్టు గేట్లు ముసివేత

65చూసినవారు
వనపర్తి: జూరాల ప్రాజెక్టు గేట్లు ముసివేత
వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఇన్ ఫ్లో తగ్గడంతో గేట్లు మూసివేసినట్లు సోమవారం ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 60, 000 క్యూసెక్కులుగా ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 8. 261 టీఎంసీలుగా ఉందని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తికి 38, 108, ఎడమకాలువకు 1, 080, కుడికాలువకు 170 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు చెప్పారు. వరద ప్రవాహం పెరిగితే గేట్లు తెరిచే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్