వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం మాట్లాడుతూ, తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మాజీ సీఎం కేసీఆర్ పండగలా చేశారని, రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టారని అన్నారు. పల్లెలు తిరిగి కళకళలాడేలా చేశారని, కొందరు కేసీఆర్ పై వ్యక్తిగత పనుల కోసం అపాయింట్మెంట్ దొరకలేదని, పని కాలేదని విషం చిమ్మారని ఆయన ఆరోపించారు.