బంగారు దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డ దొంగల ముఠాను శుక్రవారం వనపర్తి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు వివరాల ప్రకారం.. కొత్తకోట పట్టణంలోని శివాంజనేయ జాలరీ షాప్ లో ఈ నెల 4న మహారాష్ట్ర చెందిన 7గురు దొంగల ముఠాను సభ్యులు బంగారు షాపులో ఉన్న వ్యక్తిని మభ్యపెడుతూ బంగారం దొంగతనం చేశారు. జ్యువెలరీ షాప్ యజమాని ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాలో రికార్డుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముఠా సభ్యులు అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.