వనపర్తి: 'వైద్య సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలి'

71చూసినవారు
వనపర్తి జిల్లా ఘనపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పాము, కుక్క కాటుకు సంబంధించిన వ్యాక్సినేషన్ మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పీహెచ్సీ ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అంకితభావంతో విధులు నిర్వహిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్