అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఇరువురూ చర్చించారు. వనపర్తి అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు.