వనపర్తి: కన్యాకాపరమేశ్వరి జయంతి ఉత్సవాలో పాల్గొన్న ఎమ్మెల్యే

1చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించిన శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం పట్టణంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సుధీర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు, అధికారులు, సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్