వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి 10:30 గంటలైనా ఇంధన కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూలు కనిపించాయి. పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా చేయాలని వారు కోరుతున్నారు.