వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సోమవారం మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, రెండేళ్ల పాలనలో ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని, రైతులను బోనస్ పేరుతో మోసం చేస్తోందని విమర్శించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రైతులను గాలికి వదిలేసి బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.