ఖానాపూర్ లో పీడీఎస్ బియ్యం పట్టివేత

83చూసినవారు
ఖానాపూర్ లో పీడీఎస్ బియ్యం పట్టివేత
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని ఖానాపురం గ్రామంలో పీడీఎస్ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు. రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఇంట్లో నిలువ చేసినట్లు సమాచారం రావడంతో మంగళవారం సిబ్బందితో కలిసి 48 బియ్యం ప్యాకెట్లు, 18 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్