ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ నెలవారీ తనిఖీలో భాగంగా బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణంలోని ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పోలీసుల హాజరు పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ పై సీసీ కెమెరాలతో నిరంతరం పోలీస్ నిఘా ఉంచాలని ఆదేశించారు.