వనపర్తి జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి మాట్లాడుతూ, పదవీ విరమణ ఉద్యోగానికి మాత్రమే కాదని, కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్ఐ స్థాయికి ఎదిగిన సుబ్బరాజు ప్రయాణం యువ పోలీసులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో ఎస్పీ సునీతా రెడ్డి, సుబ్బరాజు కుటుంబ సభ్యులను పూలమాలలు, శాలువాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి, డిపార్ట్‌మెంట్‌కు ఆయన చేసిన విశిష్ట సేవలను కొనియాడారు.