ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన మహిళా వారోత్సవాల సందర్భంగా, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో రూ. 4 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ పనులను పరిశీలించారు. మహిళా అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, జిల్లాలో మొదటగా వనపర్తి, ఆత్మకూరు మండలాలకు ఈ సోలార్ ప్లాంట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే తెలిపారు.