వనపర్తి జిల్లా పానగల్ మండలం చింతకుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని గురువారం ఉదయం వాకింగ్ కు వెళ్లి, మల్లాయిపల్లి సమీపంలోని కాలువలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. శుక్రవారం కాలువలో మృతదేహం తేలడంతో గ్రామస్థులు గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.