వనపర్తి జిల్లా కేంద్రంలో ఇంధన ధరల పెంపునకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనరెడ్డి ఎద్దుల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇంధనంపై పెంచిన రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. గంటలు మోగిస్తే చప్పట్లు కొట్టినంత మాత్రాన నిరుపేదల సమస్యలు తీరవని, ప్రజలకు అధిక భారం లేకుండా చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం అధిక ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు.