గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసి, వారిని జాతీయ స్థాయికి చేర్చే లక్ష్యంతో సీఎం కప్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి క్రీడా జ్యోతి ర్యాలీని ఆయన ప్రారంభించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. యువత క్రీడలను కెరీర్ గా ఎంచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ, విద్యార్థులు పాల్గొన్నారు.