దేశంలో తొలి టెస్లా కారును కొన్న మహారాష్ట్ర మంత్రి (వీడియో)

31103చూసినవారు
విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా దేశంలో తొలి కారును డెలివరీ చేసింది. తెలుపు రంగు టెస్లా ‘మోడల్‌ వై’ కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌ సర్‌నాయక్‌ కొనుగోలు చేశారు. ముంబయిలోని ‘టెస్లా ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌’లో సంస్థ ప్రతినిధులు ఈ కారు తాళాలను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతాప్‌ మాట్లాడుతూ దేశంలో తొలి టెస్లా కారును కొనుగోలు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్